దేవుడా! అమ్మాయి కోసం ఇంత దారుణమా..!

ప్రేమ గుడ్డిది అంటారు చాలా మంది.. కానీ ప్రేమ చాలా క్రూరమైంది అని హైదరాబాద్‌ శివారులో జరిగిన నవీన్‌ హత్య ఉదంతం చెబుతోంది. కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తల్లిదండ్రులు కనే కలలను ఒమ్ము చేస్తూ.. ప్రేమ పేరుతో పెడదారి పట్టిన ఓ ముగ్గురి కథ ఇది. యుక్త వయసులో కలిగే ఆకర్షణను ప్రేమ అని భ్రమపడి.. తన ప్రేయసి వేరొకరికి సొంతం అవుతుందనే అనుమానంతో స్నేహితుడినే మట్టుబెట్టిన సంఘటన కలకలం రేపుతోంది. అసలేంటి ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. ఈ ప్రేమధ్వేషం కథలో అసలు విలన్‌ ఎవరో తెలుసుకుందామా?

నల్గొండ మహాత్మగాంధీ యూనివర్సిటీలో హైదరాబాద్‌కు చెందిన నవీన్‌, హరిహర కృష్ణలు బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నారు. వీరు ఇంటర్‌ నుంచి మంచి మిత్రులు. యూనివర్సిటీలో చదువుకుంటున్న క్రమంలో ఇద్దరూ ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. ఇక ఇద్దరిలో ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడిందో తెలియదు కానీ.. వీరు మాత్రం ఆ అమ్మాయిని విపరీతంగా ప్రేమించేశారు. ఈనేపథ్యంలో ఆ అమ్మాయి నవీన్‌తో ఎక్కువ చనువుగా ఉంటోందని హరిహర కృష్ణ భావించాడు. దీంతో కక్షపెంచుకున్న అతను… ఎలాగైనా తన ఆ అమ్మాయిని దక్కించుకోవాలని.. నవీన్‌ను చంపేయాలని పథకం రచించుకున్నాడు. ఈ నెల 17న గెట్‌ టూ గెదర్‌ పార్టీ ఉందని నవీన్‌ను హైదరాబాద్ శివారు ప్రాంతానికి హరిహర పిలిచాడు. అక్కడ ఇద్దరూ మద్యం తాగారు. ఈక్రమంలో అమ్మాయి విషయమై కొంత ఘర్షణ చోటుచేసుకుంది. అప్పటికే హత్యచేసే ప్లాన్‌లో ఉన్న హరిహర.. తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా నవీన్‌ను పొడిచి చంపేశాడు.

హత్య తర్వాత అమ్మాయికి మెసేజ్‌ చేసిన హరిహర..
నవీన్‌ను హత్య చేసిన హరిహర అంతటితో వదల్లేదు. అతని చేతి వేళ్లు, తల, ప్రైవేట్‌ పార్ట్స్‌, గుండె బయటకు తీసి.. వాటి ఫొటోలను ప్రేమించిన అమ్మాయికి పంపాడు.. ఇవే వేళ్లు కదా నిన్ను తాకింది… ఈ గుండె కదా నిన్ను కోరుకుంది.. అంటూ ఆయా ఫొటోలను అమ్మాయికి పంపాడు. దీనికి బదులిచ్చిన అమ్మాయి… ఓకే.. వెరీగుడ్‌ బాయ్‌,, అంటూ రిప్లే ఇవ్వడం ఇప్పడు అనుమానాస్పదంగా మారింది. హత్య విషయం ఆ అమ్మాయికి ముందే తెలుసా… ఉద్దేశపూర్వకంగా సందేశాలు ఆమె పంపిందా లేదా అన్న అనుమానాలు పోలీసులుకు కలుగుతున్నాయి. ఇవన్నీ పక్కనపెడితే.. కేవలం ప్రేమ పేరుతో తన స్నేహితుడిని కడతేర్చిన హరిహర కృష్ణ.. ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయితో ఉండే అవకాశం ఉంటుందా..? తన ప్రేమతోపాటు కెరీర్‌ను కూడా పాడుచేసుకుని తల్లిదండ్రులకు తలవంపులు తీసుకొచ్చాడు. ఇక ఈ ఘటనలో అసలు విలన్‌ యుక్త వయసులో కలిగే ఆకర్షణ, ఆవేశం అని స్పష్టమవుతోంది.

పోలీసుల అదుపులో నిందితుడు.. 
నవీన్‌ కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు నవీన్ మృతదేహాన్ని హైదరాబాద్ శివారులో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకుండా పోతుందనే బాధతో నవీన్ ను హత్య చేసినట్లు హరిహర విచారణలో చెప్పినట్లు సమాచారం. మరోవైపు మృతుడి తండ్రి మాట్లాడుతూ.. తన కుమారుడిని చంపిన వాడిన కఠినంగా శిక్షించాలని కోరారు. నవీన్కు హరిహరకృష్ణ స్నేహితుడని తమకు తెలియదన్నారు. హరిహరకృష్ణ పద్ధతి నచ్చక అమ్మాయి దూరమైందని ఆయన పేర్కొన్నారు. ఆ అమ్మాయికీ నవీన్ కు మధ్య స్నేహ సంబంధం మాత్రమే ఉందని ఆయన తెలిపారు. మరోవైపు నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ సాయి పేర్కొన్నారు. త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *