పాక్‌ పెళ్లిలో “నాటు నాటు” సందడి.. వీడియో వైరల్

దర్శకధీరుడు ఎస్.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాటకు అంతర్జాతీయంగా ఎంతటి స్పందన లభించిందో తెలిసిందే. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించగా.. ఈ పాటను ప్రేమ్‌ రక్షిత్ కంపోజ్‌ చేసారు. అయితే ఇప్పుడు ఈ పాట దాయాది దేశం అయిన పాకిస్థాన్‌ వాసుల చేత కూడా స్టెప్‌ వేయించింది. హనియా ఆమిర్‌ అనే పాకిస్థానీ నటి ఓ పెళ్లిలో నాటు నాటు పాటకు డ్యాన్స్ వేసి ఉర్రూతలూగించింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలో.. నాటు నాటు పాట హుక్‌ స్టెప్‌ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ అందులోనూ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ లాంటి డైనమిక్‌ డ్యాన్సర్లు ఈ పాటలో నటించడంతో ప్రపంచాన్నే ఒక ఊపుఊపేసింది. వారు వేసిన హుక్‌ స్టెప్‌ని ఇమిటేట్‌ చేస్తూ కొన్ని కోట్ల మంది రీల్స్ చేసారు. ఇటీవల ఈ పాటకు గానూ గోల్డెన్‌ గ్లోబ్స్ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. అంతేకాదు ఈ పాట ఆస్కార్స్‌కు కూడా నామినేట్‌ అయింది. ఇక ఆస్కార్ రావడం ఒక్కటే ఆలస్యం. ఇటీవల రామ్‌ చరణ్‌ అమెరికాకు వెళ్లారు. అక్కడ న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక గుమ్‌మార్నింగ్ అమెరికా అనే ఫేమస్ టీవీ షోలోనూ పాల్గొన్నారు. ఈ షోలో పాల్గొన్న మొదటి భారతీయ నటుడు రామ్‌ చరణ్‌ కావడం గమనార్హం.

https://www.instagram.com/reel/CpBDqw2jdJN/?utm_source=ig_web_copy_link

ఈ సందర్భంగా అక్కడి మీడియా రామ్‌చరణ్‌తో మాట్లాడుతూ.. ఒకవేళ నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తే ఏం చేస్తారు? అని అడిగింది. ఇందుకు రామ్‌ చరణ్‌ స్పందిస్తూ.. నాకు తెలిసి నేను ఆ వార్తను నమ్మలేకపోవచ్చు. నా చుట్టూ ఉన్న వాళ్లు నన్ను నిద్రలేపి బలవంతంగా ఆస్కార్‌ తెచ్చుకోపో అని తోస్తే తప్ప నేను నమ్మలేను. అప్పుడు ప్రపంచంలో నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ మరొకరు ఉండరు. భారతీయ చిత్ర పరిశ్రమ 80 ఏళ్ల చరిత్ర కలిగినది. ఇప్పుడు ఆస్కార్‌ లాంటి అకాడెమీ నుంచి మాకు ఈ గుర్తింపు లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాదు నాకు హాలీవుడ్‌లోనూ నటించాలని ఉంది. వీలైతే ఇక్కడి దర్శకులను కూడా కలుస్తాను అంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు చరణ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *