మరోసారి వాయిదా పడిన NTR@​30​!

‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర అధికారిక ప్రకటన గతేడాది మేలోనే వచ్చినప్పటికీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నఎన్టీఆర్ ఫ్యాన్స్​కి నిరాశ తప్పడం లేదు. ప్రతిసారీ ఏవో కారణాలతో లాంచ్​ ఆలస్యమవుతూ వస్తోంది. నిజానికి ఫిబ్రవరి 24న మూవీని లాంచ్ చేసి, మార్చి మూడో వారంలో షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావించారు. కానీ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి తారకరత్న మృతితో మూవీ లాంచ్ వాయిదా పడింది. దీంతో మార్చిలోనే మూవీని లాంచ్ చేసి, షూటింగ్ కూడా ప్రారంభిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ మార్చిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది. మార్చిలోనైనా ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని వారు ఆశపడుతుండగా.. ఇప్పుడది ఏప్రిల్ కి వాయిదా పడిందని ఇన్ సైడ్ టాక్. ఈ మూవీని పూజా కార్యక్రమాలతో మార్చిలో ఘనంగా ప్రారంభించి, షూటింగ్ ని మాత్రం ఏప్రిల్ లో మొదలుపెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది.

కాగా, సినిమా లాంఛింగ్‌ కొత్త తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. ఎన్టీఆర్‌ 30 మూవీని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రత్నవేల్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.  ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. తారక్, కొరటాల కాంబోలో ఇప్పటికే జనతాగ్యారేజ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. జనతాగ్యారేజ్‌ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ 30పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే కొరటాల టీం విడుదల చేసిన ఎన్టీఆర్‌ 30 మోషన్ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ టెక్నాల‌జీని వాడబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ 30లో తారక్​ సరసన హీరోయిన్​గా ఎవరు నటించనున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేసినట్లు టాలీవుడ్​ టాక్​.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *