లీకైన ప‌వ‌న్ లుక్.. సోషల్​ మీడియాలో వైరల్​​!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్​ తేజ్​ కాంబినేషన్లో వినోదయా సీతం రీమేక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పవన్ ఈ చిత్రానికి కేవలం 20 నుంచి 25 రోజుల డేట్స్ మాత్రమే కేటాయించారట. ముందుగా ఆయ‌న‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించి ఆ త‌ర్వాత మిగతా సన్నివేశాలను చిత్రీక‌రించ‌నున్నారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాదులోనే జరుగుతోంది. సెట్స్ నుంచి వర్కింగ్ స్టిల్స్ లీకయ్యాయి. రెడ్ క‌ల‌ర్ టీష‌ర్ట్ ధరించిన పవన్ కళ్యాణ్ కారుపై స్టైల్ గా కూర్చుని ఉన్నారు. ఎదురుగా సాయి ధరంతేజ్ ఉన్నారు. వీరిద్దరికీ దర్శకుడు సముద్రఖ‌ని సీన్ ని వివరిస్తున్నారు. పవన్ లుక్ ఆసక్తి రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆరు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు పవర్​ స్టార్​. ఆగ‌ష్టు11న విడుద‌ల చేయాలనుకోవడంతో షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది.

ఈ చిత్రానికి దేవుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొదట దేవర‌, భగవంతుడు అనే టైటిల్స్ అనుకున్నారు. అయితే దేవుడు అయితే క‌రెక్ట్ గా సూట్ అవుతుంద‌ని భావించారు. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భగవంతుడిగా కనిపించ‌నున్నారు. దేవుడుగా  పవన్, మానవుడుగా సాయిధరమ్ తేజ్ న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ సందేశం ఉంటుంది. తమిళంలో వినోదయ సిత్తం మంచి విజయం సాధించింది. త‌మిళ వెర్షన్ కి కూడా స‌ముద్రఖ‌ని దర్శకత్వం వహించారు. ఆయన చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అయితే తెలుగు వర్షన్ కి దర్శకుడు సమూల మార్పులు చేశారట. పవన్ ఇమేజ్ కి తగ్గట్టు  ఓ సరికొత్త పవన్ ని దర్శకుడు ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం.

ఇక ప‌వ‌న్ ప్రస్తుతం క్రిష్​  జాగర్లమూడి దర్శకత్వంలో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ చిత్రంలో న‌టిస్తున్నారు. హరీష్​ శంకర్​ దర్శకత్వంలో ఉస్తాద్​ భగత్​సింగ్​ సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ ఏడాది పవన్​ ఏకంగా మూడు సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్​. మ‌రోవైపు సాయిధ‌ర‌మ్‌తేజ్ బైక్ ప్రమాదం త‌ర్వాత ‘విరూపాక్ష’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మొత్తానికి దేవుడు చిత్రం ద్వారా సాయిధ‌ర‌మ్ తేజ్ తొలిసారిగా త‌న చిన్న మేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండ‌టంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *