‘RRR’ రీరిలీజ్ డేట్​ ఫిక్స్!

ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. గతేడాది మార్చి 25న విడుదలైన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరిస్తున్న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. దేశవ్యాప్తంగానే కాదు ఈ సినిమా యూఎస్ఏలోనూ విడుదల కానుంది. మార్చి 3న దాదాపు 200 థియేటర్ల రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకులంతా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచడంతో పాటు.. హాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ప్రశసంలను అందుకుంది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్, ఎడ్గార్ రైట్ తో పాటు ఎంతోమంది ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. దీనికి తోడు చిత్రం ప్రతిష్టాత్మకమైన అవార్డులనూ సొంతం చేసుకుంటూ హౌరా అనిపిస్తోంది. ఆస్కార్స్ బరిలో నిలవడంతో పాటు.. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను దక్కించుకుంది. ఇలా అంతర్జాతీయ వేదికపై గత ఏడాదిగా ‘ఆర్ఆర్ఆర్’పేరు మారుమోగుతూనే ఉంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో రూపొందిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ గత ఏడాది మార్చి 24న రిలీజ్ అయి ప్రారంచావ్యాప్తంగా ఎంతో పెద్ద సంచలన విజయం అందుకుంది. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, రే స్టీవెన్సన్, ఎలిసన్ డూడి తదితరులు కీలక పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమురం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా తమ అత్యద్భుత నటనతో గ్లోబల్ గా ఆడియన్స్, ఫ్యాన్స్ మనసు దోచారు.కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ దాదాపుగా రూ. 1200 కోట్ల పైచిలుకు కలెక్షన్ ని దక్కించుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులని సైతం అందుకుంటోంది. ఇక అభిమానులను అలరించేలా రూపొందించిన రీ రిలీజ్ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకాభిమానుల నుండి మంచి ఆదరణ అందుకుంటోంది. మరి రీ రిలీజ్ తరువాత ఆర్ఆర్ఆర్ ఏ మేర కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *